పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/341

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

329

తనకుమారుండు యుద్ధము గెల్చె ననుచుఁ
గొనియాడుటకు నిన్నుఁ గొనియాడ నేను
మనబృహన్నల గెల్చె మఱి గెల్చువారు
మనవీట లేరన్న మదిలోన మ్రంది
యుత్తరుజయ మాడ నోర్వ లే ననుచు
మొత్తె నెత్తపుసారె మోము దాఁకంగ.
ఆపోటుగంటి నీ కా వేళఁ జూప
నోపక చీరమా టొనరించి నేను
నుండితి" నని గంటి నొయ్యనఁ జూప
గాండీవి లయకాలకాలుఁ డై మండి
“వినుము గర్వించినవిరటు మర్దించి
మనము చేకొందము మత్స్యరాజ్యంబు;
తనుఁ దా నెఱుంగక తా నెంత చేసె!
అనుమాన మేలు వీఁ డధముండు గాఁడె?
చెనఁటి యై మిము వ్రేయఁ జేతు లెట్లాడె ?
పనుపుఁ డేగెద" నన్నఁ బలికె వాయుజుఁడు
"నీదాఁక నేటికి నెమ్మి నే నేగి
యా దుష్టమతిఁ గూల్చి యతనిచుట్టములఁ
బొల మొకయెముకగా బోరాడి చంపి
కలహంబు లేనియీకనలు పో విడుతుఁ