పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/340

ఈ పుట ఆమోదించబడ్డది

328

ద్విపదభారతము

వచ్చి యచ్చటను భూపతిసూతి ననిపి
క్రచ్చర నుత్తరాంగనఁ జేరఁ బిలిచి
బామ్మపొత్తిక లిచ్చి పొసఁగ మన్నించి
సమ్మతిఁ దన నివాసముఁ జేరి యుండె.
అప్పుదు దిన నాథుఁ డ స్తమించుటయు
నప్పాండుతనయులు నబ్జాక్షి తారు
యమనూనుఁ డున్న గృహంబందుఁ గూడి
విమతు లోడినవార్త విన్నవా రగుడుఁ
గడు సంతసిల్లి యగ్రజువంకఁ జూచి
వడముడితోడ వివ్వత్సుఁ డిట్లనియె
"ఇప్పు డేమిటికిఁ గా నితఁడు నావంకఁ
దప్పక మాడఁ డేతప్పు చేసితినొ
సమయంబు దప్పెనో, చలము. రెట్టింప
విమతులఁ దోలినవిత మేమి తప్పొ?
ఏ వెంట వెధకిన నీ కారణంబు
భావింప నేర నేర్పఱుపవే” యనిన

విరటుఁడు ధర్మజుని సారెల వ్రేయుట విని భీమార్జునులు రేఁగుట.


ననుజన్ము నీక్షించి యమసూతి పలికె
"విను మేదియును లేదు విరటుండు నేఁడు