పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/338

ఈ పుట ఆమోదించబడ్డది

326

ద్విపదభారతము,

గరి నెక్కి వచ్చి వికర్ణుఁ డడ్డంబు
చొరఁ బాఱి తూపులసోనలం గురిసి
తనలావు చూపుచోఁ దడఁబాటు లేక
యనువుగా నొకకోల నమ్మహాత్ముండు
వానియేనుఁగుఁ జంపి వానిఁ బోఁ దోలి
మానవేశ్వరుమీఁద మఱియు నేయుటయుఁ
జతి సచ్చె నని నేన భగ్న మై పాఱెఁ
బతియును బాఱె భూభాగంబు లగల.
ఆవీరుఁడును బాఱి యతనిఁ బోఁ దఱిమి
తా వచ్చె” ననిన భూతలనాథుఁ డలరి
"ఇట్టిపుణ్యాత్ముఁ డెయ్యెడ నుండు నిపుడు :
నెట్టనఁ దోడ్తేర నేర్వ లే వైతి ;
ఆతనిఁ బూజింతు నర్ఘ్యపాద్యముల
నాతనిచరణంబు లర్థితోఁ గొలుతు;
అన్న న్న యతఁడు రాఁ డయ్యె నిచ్చటికి !
ఎన్నఁడు వీక్షింతు నే" నన్న నతఁడు
"తా వచ్చె. వచ్చి యంతర్ధానుఁ డయ్యె.
ఏవేళ వచ్చునో! యిట రాక పోఁడు.
దేవతాంశమువాడు దివ్యాస్త్ర విదుఁడు
భూవర మనకు నాపురషుండు వచ్చి