పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/337

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--అ-5

325

గురుఁడును దాఁకి నుగ్గులు గాఁగఁ బోరి
శరములు గాఁడి మూర్ఛను జెంది పోయె
మఱియు నశ్వత్థామ మహితుఁ డై తాఁకి
నెఱయ నెన్నటికి మానిసి కాక పోయె.
అప్పుడు గాంగేయుఁ డాలంబు సొచ్చి
నిప్పులు గన్నుల నెఱయంగ నడరి
వితత శౌర్యాటోపవిభవంబు దోఁప
నతులదివ్యాస్త్రంబు లందందఁ బఱపి
పోరాడియును వైరిభూరి బాణముల
బారి బీరము సూప పలఁతి గా కకట
యురము బీటలు వార నొగిని మూర్చిల్లె.
అరిదిసౌర్యము సూపి యమ్మహాపురుషుం
డెదు రైనవీరుల నిట్లు గెల్వగను
జెదరిన సైన్యంబుఁ జేరంగఁ బిలిచి
తమ్ములుఁ దాను భూతలనాథుఁ డంత
నిమ్ముల నతనితో నెదిరి పోరాడ
నురములు వ్రక్క లై యూర్పులు వదలి
కరములు తెగి పోన గళములు గ్రుచ్చి
ఫాలసీమలు నొచ్చి బరు లుచ్చి పోయి
కాలు చే యాడక గాసిలునంతఁ