పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/328

ఈ పుట ఆమోదించబడ్డది

316

ద్విపద భారతము.

ఏఁ గాఁగ నోర్చితి నిన్ని మాటలకు
లోఁగక యింకఁ బల్కుట గాదు విడువు”
మనుటయుఁ జలముతో నతఁడు వెండియును
జననాథుఁ జూచి హాస్యము దోఁపఁ బలికె
"వెస బృహన్నల నేఁడు వీరాహవమున
రసికు మీసుతుని సారథిఁ జేసి తాను
ధనువు ధరించి యుద్ధము చేసెఁ గాని
యొనర సారధికృత్య మొనరింపఁ డతఁడు ;
కడపట నిట్లు కాఁ గలదు కార్యంబు ;
తడయక నీవింక ధరణీతలేశ
నగరంబులో బృహన్నల గెల్చు చాటఁ
దగువారిఁ బంపుము తగ వొప్ప" ననినఁ
జండకోపావేశజాల్ముఁ డై మండి
దండ మెత్తినదండధరునిచందమునఁ
దనచేతిసారె నుద్ధతిఁ బూని ధర్మ
తనయుని నేయఁ గ్రోధము లేక యతఁడు
తొడరి యజాతశత్రుఁడు గాన నవ్వి
తడయక ద్రుపదనందనఁ జూచుటయును
అరుదారఁ జనుదెంచి యావ్రేటుగంటిఁ
దొరఁగునెత్తురుఁ జూచి ద్రుపదతనూజ