పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/326

ఈ పుట ఆమోదించబడ్డది

314

ద్విపద భారతము.

పోడి గా దనక యల్పులె వీర లనక
తో డెవ్వ రనక కైదువు దాఁకు ననక
తల మీఱి గెలిచె నింతటి వాఁడు గలఁడె?
కుల ముద్ధరించినకొడుకు నాకొడుకు
ధాత్రిలో నిదియుఁ జిత్రము గాదె" యనిన
"ధాత్రీశ విను” మని ధర్మరా జనియె
“కౌరవు లెల్ల నిక్కడ వచ్చి రనఁగ
బోరునఁ బోయి మీభూమింజయుండు
వారలబాహుగర్వమునకు నోర్చి
శూరుఁ డై గెల్చి వచ్చుట నిక్క మైన
నితనిఁ బోలిన వీరు లెవ్వరు గలరు ?
హితబుద్ధి వీని మీ రెఱుఁగ రే?" యనిన
నుర్వీశుఁ డామాట కోర్వంగ లేక
గర్వించి పాండవాగ్రజువంకఁ జూచి
"ఎలమి నిట్లను టెల్ల నీవు మాసుతుని
గెలుపు లే దనెడు చక్కియపల్కు గాదె?
చాలు నూరక యుండు సన్యాసి వగుటఁ
జాలించి విడిచితి సకలకోపములు.
తగఁ బెద్ద నయ్యుఁ బెద్దలజాడ నుండ
కగునొకో నీ కిటు లాడు చుండఁగను ? "