పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/322

ఈ పుట ఆమోదించబడ్డది

310

ద్విపదభారతము.

అనినఁ గంపించి మత్స్యాధీశ్వరుండు
తనమంత్రివరుల నందఱఁ జూచి యనియె
"పసులఁ బట్టుట విని పసిబిడ్డ గానఁ
బొసఁగ మీఁ దెఱుఁగక పోయె నుత్తరుఁడు.
ఇతఁ డెంత, కురువీరు లెంత? మీ రకట
హిత మాడ కాతని వెట్లు పుచ్చితిరి ?
తప్పెఁ గార్యము గానఁ దగుసేనఁ గూర్చి
యప్పాపనికి సాయ మను వొందఁ జేయ
మీబలంబులు మీరు మెఱసి పో వలయు
నా బాలుఁ గొని తెచ్చి ననుఁ బ్రోవుఁ" డనినఁ
గంకు డి ట్లనియె భూకాంతు నీక్షించి
"శంక నీ కేల సుశర్మ గెల్చియును ?
వాఁ డోడెఁ గాన నవ్వలను రారాజు
నేఁ డోడి పోవుట నిర్ణయించితిమి.
అదియునుగాక బృహన్నల నేఁడు
కదనంబునకుఁ దోడుగా బోయెఁ గానఁ
గురుసేన గెల్చుట కొనియాడ నేల ?
సురసేన నైన నీసుతుఁడు నిర్జించు"
నని తెల్ప మఱియు భీతాత్ముఁ డై నృపుఁడు
తనబాంధవులఁ జూచి తగుసంభ్రమమున