పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/319

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ- 5

307

భావించి లజ్ఞించి పలికె నుత్తరుఁడు
"భూవిభుఁ డెఱుఁగడె బొం కైనమాట
వెసఁ కౌరవుల నేను విదళింప లేమి
వసుఁధేశుఁ డేల యెవ్వరు నెఱుంగుదురు !
మంచున నణఁగునే మార్తాండరుచులు ?
నించిననీలావు నెఱి దాఁప నేర;
నీయనుమతి లేక నీప్రసంగంబు
సేయ నేఁ బతితోడఁ జిరకీర్తిహార;
మీవాఁడ మీయాజ్ఞ మీఱ లే" ననఁగ
నావాసవాత్మజుం డట జమ్మిఁ జేరి
యొవర గాండీవాదియుద్ద సాధనము
లనువుగాఁ దొల్లిటియట్ల కట్టించి
కపి కేతనంబు శంఖముఁ గిరీటంబు
విపులముల్‌ మఱి కొన్ని వేల్పు లిచ్చినవి
వీక్షించి మ్రొక్కి వేర్వేఱ వీడ్కొల్పి
యక్షీణరథముపై హరికేతు వెత్తి
యత్తఱిఁ దొంటిశస్త్రాస్త్రంబు లిచ్చి
యుత్తరు రథికుగా నొనరించి తాను
సారథి యై నపుంసక రేఖ దాల్చి
ధీరుఁ డై నొగ కెక్కి తేరు దోలుచును