పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/316

ఈ పుట ఆమోదించబడ్డది

304

ద్విపదభారతము.


మూర్ఛఁ దేఱి కౌరవసేన పాఱి పోవుట.

ఇతర సైన్యంబులు నెలమితోఁ ద్రెళ్ల
కిత వాడె నని భీష్ము నెలమితోఁ బొగడి
రారాజు నొకకొంత రక్షించుకొనుచు
భేరుల రొద మాన్చి బీరంబు లెడలి
బెదరుచుఁ దమయూరి పినుత్రోవఁ బట్టి
కదలినఁ జెడ నార్చి గాండీవధరుఁడు
గుణనాదమున శంఖ ఘోరనాదములఁ
బ్రణుతించుదివ్యుల భాషణంబులను
భూసభోవీధిఁ గప్పుచు నంటఁ దఱిమి
సేవకు: "బోయి వచ్చెద" నని చెప్పి
బెడఁ గైనగొడుగులు బిరుదు టెక్కేములు
నడియాలముల నెల్ల నవనిపైఁ గూల్చి
సరసుఁ డై గురుకృపాచార్య భీష్ములకుఁ
బరఁగ నమస్కార బాణంబు లేసి
యొకమిట్టకోల నయ్యురగ కేతనుని
మకుటరత్నంబులు మహి డొల్ల నేసి
వారి వీడ్కొనినభావము నిర్వహించి
ధీగుఁ డై నిలిచినఁ దెరలి సైన్యములు