పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/315

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ -5

303

గరళంబురూపు లై కర మొప్పుతూపు
లరుదార నేయుచు నటఁ జిక్కు పఱిచి
యడరి రాహుగ్రస్త మై నోరిలోన
వెడలినయినుఁ బోలె వెడలె నచ్చోటు.
అప్పుడు మూర్ఛ యొయ్యనఁ దేఱి విభుఁడు
ఱెప్పలు దెఱచి జాఱినవిల్లు దాల్చి
తలచీరఁ గాన కెంతయు వెచ్చ నూర్చి
నలుదిక్కులను జూచి నరు నొప్పఁ గాంచి
కాలాగ్ని రుద్రుని కరణిఁ గోపించి
యాలంబు సేయ నుద్యతుఁ డైనఁ జూచి
పరఁగ లేనగవుతోఁ బలికె భీష్ముండు
"నరనాథ యింక మానఁగ రాదె రణము ?
నరుచేతఁ జిక్కి సైన్యముఁ జంపుకొనక
తిరిగి యూరును జేరి తెఱఁ గొప్పఁ బాండు
తనయులకును వారితండ్రిపా లొసఁగి
పెనుపారుకూరిమి వెలయించు టొప్పు.
ఈమాటు నామాట యిచ్చలో నాటు
మీమచ్చరము నేఁటి కేమిటి?" కనిన
గురుమంత్రయుత మైన ఘోరాహి వోలెఁ
గురురాజు నిలిచె నక్షులఁ గెంపు గదుర.