పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/312

ఈ పుట ఆమోదించబడ్డది

300

ద్విపదభారతము.

పోరాడు, పోయినఁ బోవ నీ" ననివఁ
గౌరవనాథుఁ డాగ్రహముతోఁ దిరిగి
తొలఁగక గాంగేయద్రోణులఁ గడచి
బలభేదిసుతుఁ దాఁకి బవరంబు సేయ
దొరలును మరలి బంధురబాణవర్ష
నిరతు లై తాఁకిరి నెమ్మి నర్జునుని.
వారలఁ జూచి కవ్వడి విల్లుఁ ద్రివ్వఁ
గౌరవబలము నక్కడఁ బోక తిరిగి
ధైర్యంబు భీతీయుఁ దగిలి వర్తింప
శౌర్యభూషణుఁ డైనశక్రజుఁ దాఁకి
భూరజఃపటలంబు భువనంబు నిండ
నారాచరోచులు నలువైపు లలమ
సింహనాదార్భటిఁ జెవులు ఘూర్ణిల్ల
రంహవిస్ఫూర్తి తోరంబుగాఁ బ్రబలఁ
గరవాలపటుశూలఘనభిండివాల
శరజాలముల నెల్లఁ జతురు లై కప్ప
నవ్వడి కొదుగక యాలంబు సేయు
కవ్వడిపై వాఁడు కలనేర్పుఁ జూపి
వడి నెల్ల దిక్కులు వ్రయ్య నార్చుటయుఁ
గడు నుగ్రుఁ డై మండి గాండీవధరుఁడు