పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/305

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము

293


 
లక్షింపఁ గురు సేనలకు సిగ్గు లేదు ;
శిక్షించి విడిచినఁ జెదరి పో వలదా?
చది యంగఁ గొట్టిన జాఱంగ లేక
పదిల మై కలసి యెప్పటియట్ల వచ్చు !
ఎన్నఁడు మోక్ష మిం కెన్నడు గెల్చు !
ఎన్నఁడు విరటుతో నేను భాషింతు !
సూతకృత్యమునకుఁ జొరం జాల నింక ;
చేతులు నొచ్చె నొచ్చితి నన్న నవ్వి
న ముఁ డొప్ప ననియె " మానవ నాథతనయ
కర మొప్ప నీ డేఱె గార్య మంతయును.
తొడరి యింతకు మున్ను చుర్యోధనునకు
సుడియుతూపులచవి చూపంగ లేదు;
అతఁడును సన్నద్ధుఁ డై యున్న వాడు
హితులుఁ దమ్ములు దాను నిదెకయ్యమునకు.
తురగరత్నంబుల దోలి నేసరితి,
పరఁగ నేనును దోడుపడువాఁడ ,ననుచుం
దేరు పో ని” మ్మని తెలిపి చెప్పినను
ధీరుఁ డై యపుడు ధాత్రీపాలనుతుఁడు