పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/303

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము-ఆ-.

291

నతఁడు వేరొకచాప మరయునాలోన
శతలక్షణా శతకోటిశతపరంపరల
ఘన మైన యురము ప్రక్కలు సేయ నతఁడు
పని చెడి రథము పై ఁ బడి మూర్ఛపోయె.
పోయినయెడఁ జిన్న బోయి సారధియు
నాయసరథము నొయ్యనం దోలుకొనుచు
నచ్చోటు దొలఁగిస వా హవక్రీడ
విచ్చలోఁ దనివోక యింద్రనందనుఁడు
తల యెత్తి చూచి రాధాపుత్రుఁ గృపున్ని
గలశజు మఱియు నక్కడివాఁరి గాంచి
అశ్వత్థామ మరభాషణంబులం
గర్ణునిం గేలి సేయుట,
యటం దేగు దోలింప నంత ద్రోణజుఁడు
పటుతరాటోపు డై పలికె భానుజుని
 గాండివి మఱియు నిక్కడ వచ్చెఁ గర్ణ
చెండాడి విడుచును సేన సంతయును;
ఏవంకఁ దొలఁగుద మేమి సేయుదము?
నీవు మార్కొన రాదె నిలుచు నీచేత ;
నకల సేనలు గాచి జయసిద్ధిఁ బొందు
మొకని కొక్కడు చాలు యుద్ధంబు సేయ”