పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/302

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

ద్విపదభారతము.


సురనదితో గూడ సురరాజు తోట
పరఁగఁ బచ్చనిశాక పాకంబు చేసె.
అంత సర్జునుఁ డేచి యా భీష్ముచాప
మింతింత తుముఱు గా నేసి కూర్చుటయు
మునుకొని రేగిన పులినోలె భీష్ముం
డొనరఁ గోపించీ వేఱొకవిల్లు దాల్చి
శరము లేయుచు నుండె; చక్రరక్షకులు
తరమిడి, ఘోరయుద్ధము చేయునపుడు
నరుఁ డేచి వారి నందఱద్రుంచి వైచె.
సుర రాజసుతుఁడు భీష్ముని నొవ్వ నేసి
యతనిసారధిఁ జంపి హరులఁ జెండాడి
యతనిసిడంబు వ్రయ్యలు వాఱ నేసి
వనజాసనున కైస నారింప రాని
యనువునఁ బోరాడ నడరి భీష్ముండు
భయ మేది నరునిదా పలిభుజంబునను
రయ మొప్ప దొడ్డ నారసము నాటించి
సిందూరముతో సింధుకం బనఁగ
సందంద రక్తసిక్తాంగుఁ జేయుటయు
వెండియు నాతనివింటి నర్జునుఁడు
ఖండించి యార్వ సఖండకోపమున