పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/276

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

ద్విపదభారతము.

నావులమందలో వ్యాఘ్రంబు చొచ్చి
వావిరిఁ గలఁచునప్పగిది నర్జునుఁడు
కురుసేనఁ జొచ్చి తా ఘోరంబుగాను
శరములు వర్షించి సమయింప నరులఁ
జిత్రాంగదుండును జిత్రసేనుండుఁ
జిత్రరథుండుఁ జెచ్చెర వికర్ణుండు
సరగ శ్రతుంతపసంగ్రామజిత్తు
లరయ దుర్ముఖదుర్జయాఖ్యదుష్కృతులు
మరియుఁ బే రైనకుమారవర్గంబు
మురు వొప్పఁగాఁ గ్రీడి మున్నాడి తాఁకి
తఱచుగాఁ దూపు లుధ్ధతి నెల్లయెడలఁ
బఱపి దిక్కులు దీప్తిఁ బరిఢవిల్లఁగను
జెల రేఁగి తమ సేయుసింహనాదములు
బలిమి శేషునిశ్రోత్రపటంబు పగులఁ
గదనంబు సేయుచో గాండీవి యపుడు
"పదర నేటికి మీరు పసిబిడ్డ" లనుచుఁ
దలపోసి సగరనందనులపైఁ దొల్లి
నలిగినకపిలసంయమిపోలె నలిగి
ధరఁ గూల్చె బాణసంధానజర్ఝరితఁ
బరచాపపర యుగ్యపర కేతనములు.