పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/258

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము.-ఆ-౫.



శ్రీకరచారిత్ర శృంగారగాత్ర
థీకల్పితోద్ధార దేవయముమ్మ
వినుము వెండియు నిట్లు వివరింపఁ దొడఁగె
జన మేజయునకు వైశంపాయనుండుః
ఈచందమునఁ గౌరవేశుండు మొనలఁ
జూచు చుండఁగఁ బేర్చి సురరాజసుతుఁడు
బాహుబలాభీలభవ్యదోర్దండ
దోహల బాణసందోహంబు పఱపి
వులినోటిమాంసంబుఁ బుచ్చికొన్నట్లు
బలియురచేఁ బడ్డపసిఁ గ్రమ్మరించి,
యరు దొంది కురునాథుఁ డరిసేన నుంట
గరుడుండు తాఁ బన్నగముఁ గన్నమాడ్కి
నారూఢి నర్జునుం డప్పుడు వీక్షించి
బీరంబు మోమున వెలయంగఁ బొంగి