పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/257

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ-౪.

245

చారయశఃపూర సరసగంభీర
భీరువైరిత్రాణ భీమప్రతాప
తాపసకృత సౌఖ్య ధర్శస్వరూప
రూపమనోజాత రుచిభానుబింబ
బింబాధరా భద్రబిరుదావలంబ
లంబధరాథీర లలితసంచార
చారుతరస్తుతసద్గుణాధార
ధా రాధరౌదార్యధర శుభావాస
వాసవప్రతిమాన వరజినావాస
ధీశక్తినిజపాత్ర దేనయపుత్ర
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితవిరాటపర్వమున నాశ్వాస
ముచితార్ధయుతముగా నొప్పె నాలవది.