పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/242

ఈ పుట ఆమోదించబడ్డది

230

ద్విపదభారతము.

ఎలమి కౌరవసేన నెన్నిక కెక్కఁ
గలుగునీ వెన్నఁ డేకయ్యంబులోన
నిలిచి గెల్చితి వది నెఱయంగఁ దెలుపు.
పలుకు నేర్తుపు చాల ! పలుకు లిం కేల ?
పోటుమాటలె కాక బుద్ధిమార్గంబు
సూటి నీ వెఱుఁగవు ; సూక్ష్మంబుగాను
వివరింతు మది నీకు వినుము; కౌంతేయు
లవనిఁ బ్రఖ్యాతసమర్థు లందఱును.
చెచ్చెర నంభోధిఁ జేయీఁత నీఁదఁ
వచ్చిన వచ్చు; వివ్వత్సు గెల్వఁగను
గావు పో ద్రోణుండు గాంగేయుఁ డేను
నీవు నీతమ్ముఁడు నృపుఁడు సైన్యములుఁ
గూడి తాఁకినఁ గాని; ఘోరాహనమునఁ
గ్రీడితో నొంటిఁ దాఁకిన నోర్వ వశమె ?"
అనుటయు రాధేయుఁ డాజ్యంబు పడిన
యనలంబుక్రియ మండి యతని కిట్లనియె:
"అగు నీవు పగతుర నతిభ క్తితోడఁ
బొగడ నేర్చుట యెల్ల భూనాధుఁ డెఱిఁ గె!
ఎఱిఁగియే నినుఁ బిల్వఁ; డిదె మిన్ను పడిన
నఱచేతు లిడెడుసాహసు లున్న వారు.