పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


భాసిల్లి నవరత్న పఙ్తిఁ గీలించి
చేసినపసిఁడిపాచికలు చూపుదును;
ఎచ్చోట విహరింతు రేది మీనామ
మచ్చుగా నెఱిఁగింపుఁ డని పల్కెనేని,
కంకుండు నా పేరు కౌంతేయునొద్దఁ
గొంకక వర్తింతుఁ గూర్మితో నందు.
మఱియు భూపాలుని మనసు లెఱింగి
నెఱువాది నై యుందు నేర్పు దీపింప "
అని చెప్పి నర నాథు డనిలనందనునిఁ
గనుఁగొని ధైర్యంబు కలఁగ నిట్లనియె;
« ఓభీమసేన, నీ వుగ్రసాహసుఁడ,
వేభంగి విహరించె దీమత్స్యపురిని ?
బకునిఁ గిమ్మీరునిఁ బట్టి సాధించి
ప్రకటకీర్తులఁ గన్న బహుసత్త్వనిధివి !
సౌగంధికములకై శంక లే కరిగి
బా గొప్ప యక్షుల బాఱ డోలితివి.
ఆహిడింబునిఁ జంపి తఖిలంబు నెఱుఁగ.
ఊహింప నీపాటి యున్నారె మగలు?
బిరుదుమాటలె కాని ప్రియ మాడ నేర,
వొరులచిత్తముఁ బట్ట నోపుదే నీవు ? "