పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/237

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము---ఆ-4

225

సంతసింతురు కాక ; సైన్యంబు బెదర
నింత భూషింతు రే యెదు రైనరిపుని?
అనుకూలపవనంబు హరి హేషితములు
మనకుఁ గల్గెను గాన మనము గెల్చెదము.
గురుఁ డిట్లు గాండీవిఁ గొండగాఁ జెప్పెఁ
బరఁగఁ బాండవపక్షపాతి గావునను.
నీతిశాస్త్రపుగోష్ఠి, నెఱిఁ జేయునపుడు
నాతతశస్త్రవిద్యలు నేర్పునపుడు
ననిచినతమి భోజనము సేయునపుడుఁ
బొనర నిష్టాలాపములు పల్కుఁ గాని
కలశజుఁ డని సేయఁ గలవాఁడు గాఁడు;
తొలఁ గింత మతఁ డేల దురములోపలను?
ఏపార నొకకొంత హితుఁ డయి మనకు
రూపింప మేలు గోరుచు నున్నఁ జాలు"
అనిన నశ్వత్థామ యధిపు నీక్షించి
విను మని మొగమోట విడిచి యిట్లనియె:
"ముసలిబోయల గెల్చి మొదవులఁ బట్టి
వసుధేశ నీ కింత వలదు గర్వింప.
అరుల గెల్చుట లేదు హర్షించి పురికి
నరుగుట లేదు మీఁ దరయఁ గా వలదె?