పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/233

ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

221

యాలింగనము చేసి యందంద పిలిచి
వాలినవికృతభావము చక్కఁ బెట్టి
ప్రియ మొప్పఁ బలికెఁ "గంపింతువే నీవు
భయ మెఱుంగనిమత్స్యపతికుమారుఁడవు?
దురమున శంఖదుందుభినాదములకు
ధరణీశతనయులు తల్లడింపుదురె!
వెఱపరి వై నీవు వెఱతు కా కేమి
తఱమిడి శంఖ మొత్తక మాన రాదు."
అనిన నానరుతోడ నామహీపాల
తనయుఁ డి ట్లనియెను దనువు కంపింప
"భేరినాదము విందుఁ బృథులశంఖములు
పూరింపఁగా విందుఁ బోరిలో నెపుడుఁ
గరిబృంహితధ్వని కర మొప్ప విందు
నరు దయ్యె నిది యిప్పు డవి యట్లు కావు.
కలఁ గె గర్భంబును గలఁగెఁ జిత్తంబు
తొలఁగెఁ బ్రాణంబులు తునిసె గుండియలు
నాకు నీకపి కేతనంబుఁ జూచినను.
నీకాంతిఁ జూచిన నెఱి నాటె భీతి
విమతవీరుల కెంత వెఱవ నీయెడన
క్రమముతో భీతి యగ్గల మయ్యె నిపుడు”