పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/222

ఈ పుట ఆమోదించబడ్డది

210

ద్విపద భారతము.

ఉత్తరుఁడు పాండవుల తెఱం గడుగ నర్జునుఁ డెఱింగించుట.

"అక్కట కౌంతేయు లస్త్రశస్త్రముల
నిక్కడఁ బెట్టి తా రెటు పోయి రొక్కొ !
ఆపాండవులకు మేనల్లుండ నేను ,
రేపును మాపు వారికి మేలు తలఁతు.
కాంతి నెంతయు నొప్పి కల్పవృక్షములు
కాంతేయు లై పుట్టెఁ గానిచో నవని
నాకీర్తిపుష్పంబు లాదానదళము
లా కార్యఫలము లెట్లగు మానవులకు ?
ఘనులు వా రిప్పు డెక్కడ నున్నవారొ
కినియక నీ వెఱింగినఁ జెప్పవయ్య.
ద్యూతంబు దల పెట్టి దుర్యోధనుండు
పాతకం బొనరింపఁ బాడియే తనకు!
దుర్మతివలఁ జిక్కి దుఃఖి యై నాఁడు
ధర్మజుఁ డాకీడు దాఁ దెచ్చుకొనియె !
సకల శాత్రవకోటి సమరాంగణముల
నకలంక గతి నోర్చునతిబాహుసత్త్వు
లలభీమవిజయాదు లకట యెయ్యెడల
నలజడిపా లైరొ? యఖిల భూపాల