పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/219

ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

207

పీనుఁగు గా దిది పృథ్వీశతనయ
పూని నే న టులైనఁ బుత్తునే నిన్ను ?
ఇంక నామాటల కిదియె తార్కా ణ
శంకింపకయ పొమ్ము శవ మది కాదు.
వేవేగ నాకు నావిల్లు దె” మ్మనిన
భూవిభుపుత్త్రుండు భూజంబుఁ బ్రాఁకి
మోపు విచ్చుటయును ముసలనారాచ
చాపగదాఖడ్గ చక్రదీధితులు
నెఱి మీఱి మెఱుఁగు లన్నియు నొక్కసారి
మెఱుముకై వడి దృష్టి మిఱుమిట్లు గొలుప
భావించి చూచినఁ బాములై యున్న
వేవేగ వెఱచి యవ్విరటనందనుఁడు
వెలయ నత్తెఱఁ గెల్ల విజయుచేఁ దెలియఁ
దలకొన్నభీతి యంతయు డిందుపఱచి
తేరిపై నిలు చున్న దేవేంద్ర సుతుని
"సారథి" యని పిల్చి చన వొప్పఁ బలికె:
"గ్రహములలోన భాస్కరుని చందమున
బహు చాపములలోనె భాసిల్లు నొకటి;
అహిరాజగుణ మైనహరిబాణ మైన
సహజ మై యుండును జగతి దీనికిని!