పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/218

ఈ పుట ఆమోదించబడ్డది

206

ద్విపద భారతము.

కరులమైమరువులు ఖండించునపుడు
శరము లీవిండ్లను సంధింప రాదు.
కైదువుపన లేనికయ్యంబు గలదె ?
ఆదటనా చేతి కది కాని కాదు.
ఇమ్మహీరుహ మెక్కి యీవు గాండివము
నెమ్మితోఁ దిగిచి యన్నియుఁ దొల్లిటట్ల
కట్టి ర " మ్మని శవాకార మై యున్న
కట్టఁ జూపినఁ జూచి కనలి యుత్తరుఁడు
"అది యేమి పీనుఁగు నంటికొ మ్మంటి
మది నింత యెఱుఁగవే మా చరిత్రంబు ?
ఎక్క సక్కెములచే నే నిట్లు నీకుఁ
జిక్కితి నని వెఱ్ఱి చేయఁ జూ చెదవొ?
మనసులో నెంచవు మద్యాద కొంత,
సునిశితాస్త్రము లంచుఁ జూపితి శవము!
తెలియఁ జాలవు నీవు దృష్టి పాటవము.
వలసిన నీమ్రాను వడిగ నీ వెక్కి,
యావిల్లు దెచ్చుకొ" మ్మన్నఁ బార్థుండు
భూవల్లభునిపుత్త్రు బోధించి పలికె:
“ప్రజలు ముట్టక యుండఁ బాండునందనులు
నిజకార్ముకము లిట్లు నిలిపిరి గాక