పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/204

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ద్విపద భారతము.

కరయఁగా నిజ మౌనే యది చెప్పు” మనిన
మరియు ద్రౌపది "యనుమానింప కయ్య
సారథి యతఁ డైన జననాధతనయ
కౌరవులను గెల్తు కడఁక నీ" వనిన
నెడపక సారథి యెందు లే కునికిఁ
దొడుక రమ్మని వేడ్కతోఁ జెప్పుటయును

ఉత్తర యన్నకు సారధ్యంబు సేయ బృహన్నలం బిలువం బోవుట.


“ఇత్తెఱఁ గైన నే నిదె తెత్తు" ననుచు
నుత్తర వెడలి తా నుల్లంబు చెలఁగఁ
గలికికన్నులడాలు కర్ణపూరముల
వెలుఁగున మెఱుఁ గెక్కి వింత యై పొలయ,
అందెల మొరపంబు లరసి యంచలును
సందడిఁ దనవెంటఁ జనుదెంచు చుండ
నడుగులనునుఁ గాంతి నవనీతలంబు
కడుకొని పద్మరాగస్ఫూర్తి నలర
క్రచ్చరఁ గామాంధకారంబు వెంట
వచ్చు నాఁ గ్రొవ్వెద పరిఢవింపఁ జని
నాటకశాలలో నరుఁ గాంచి యతనిఁ
బాటించి చూచుచుఁ బణఁతి యి ట్లనియె: