పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/203

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాట పర్వము--ఆ-4

189

మందహాసముతోడ మనుజేంద్రసుతుఁడు
పొందుగాఁ బాంచాలవుత్రి కిట్లనియె:
"మాలిని మాతోడ మందెమేలములె ?
ఏల నీ విట్లాడ నిపుడు నాయెడను
బరిహాసములు నీకుఁ బాడియే యకట!
అరయంగ లేవు నీ వాలంపువితము !
ఆవలఁ గురుసేన యరుదెంచునట్టె
భావింప నే వారిపైఁ బోదునట్టె
పేడి సారథి యైనఁ బృథివిలో నగరె?
కూడదు నగుబాటుకొలఁది సెప్పినను.
ము న్నెన్నఁడును బేడిముఖము నేఁ జూడఁ
జెన్నార సారథిఁ జేయ నోపుదునె?
కర మొప్ప సారధి కఱ వయ్యె నేని
పరిహాసములు నీకుఁ బాటి గా" దనిన
ద్రౌపది వెసఁ బల్కె "దైవాజ్ఞ నతఁని
కా పేడితన మైన నయ్యెఁ గా కేమి
ఖాండవదహనాదికములు పార్థునకు
డండిమై మున్ను నాతఁడు తేరు గడప
సమ కూరె" నావుడు క్ష్మాభర్తసుతుఁడు
“కొమ వీఁడు రథచోదకుం డౌట నరున