పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/197

ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

183


గలిగి రోఁతయు భీతి గలిగించుకలను
దలకొని వెడలి యందఱు నొక్కచోట
వెన్నెలబయలను విడిసి నిద్రించి
యున్నతనుఖలీల నుండి రారేయి.
కర మర్థి నట్టిసంగరముఁ జూచుచును
సురరాజు నటు పోయె సురలోకమునకు.
అన విని తర్వాత నైనవృత్తాంత
మనఘాత్మ యెఱిఁగింపు మని వేడుటయును
డిండీరకీర్తి బట్టీపాటి నిలయ
చండశాత్రవశూర సంచారధీర
మదనసన్నిభగాత్ర మలిరెడ్డి పౌత్ర
విదిత సత్కులచంద్ర విభవదేవేంద్ర
లలిత చౌషష్టికళాప్రవీణాత్మ
కలితమహా భాగ్యకర్ణాటతిలక
ఇది సదాశివభక్త హిత గుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతి పాత్ర వల్లభసూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మననామధేయ
రచితవిరాటపర్వమున నాశ్వాస
ముచితార్థయుతముగా నొప్పె మూడవది.