పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/196

ఈ పుట ఆమోదించబడ్డది

182

ద్విపద భారతము.



నవనీశచంద్రుని నర్డి జూచుటకుఁ
గువలయాక్షులఁ జేరి కోరు చున్నంత
నటఁ బాండవులు భూతలాధీశుతోడఁ
బటుతరసైన్యనంపన్ను లై కదలి
సమరంబునడుమగాఁ జనుదెంచునపుడు.
అమితభూతవ్యా ప్త మైనఠావులును,
కరి సొచ్చి విఱిచినకదళీవనంబు
పరుసునఁ దొడ లూడి పడినఠావులును,
'పాతాళబిలములో ఫణిరాజు లున్న
భాతిఁ జేతులు తెగి పడినఠావులును,
ఘనత నంచలు తెంచుకమల నాళములొ
యనఁగఁ బ్రేవులు ప్రోవు లైనఠావులును,
పూని నెత్తురునీటఁ బుష్క రాకృతులు
నాననంబులు త్రెస్సి యలగుఠావులును,
చిగురాకు నెరసినశృంగార వనము
పగిది నంఘ్రులు త్రెవ్వి పడినఠావులును,
నీలాభ్రయుత శైలనికరంబు లనఁగఁ
గూలినకరులు నెక్కొన్న ఠావులును,
విరిగి కూలిన సౌధవితతిచందమునఁ
బరియ లై రథములు పడినఠావులును