పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/185

ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-3

171



జేరి పోరఁ దొడంగి శితశ స్త్రహతుల
గారింప బల మేది కదనంబునందు
నిలువక విచ్చిన నిజసేనఁ జూచి
పలికెఁ ద్రిగర్తాధిపతితమ్ముఁ డొకఁడు :
ఎక్కడఁ బోయెద రే నున్న వాఁడ;
ముక్కంటి నైనను మొనఁ గూల్ప నేర్తు.
కాననం బొగి నేర్చుకార్చిచ్చుపగిది:
బూని యీ వైరులఁ బోరిలో నణతుఁ
గడఁక రం" డని పల్కి ఘనకోపమునను
గడునెఱ్ఱ వైనట్టికనుదోయితోడఁ
బటుతరం బగునట్టిపట్టంబు మెఱయఁ
జటులమేఘము పోలెఁ జాల గర్జించి
యరవాయి గొనక బాహాశక్తి మెఱిసి
తరవాయి గొని వైరిదర్పంబు మాన్ప
“నేలిక పోఁ గని యెల్ల సైనికులు
నాలంబు సేయుద మని పోర నిలిచి
జలనిధితోఁ దాఁకుజలధిచందమున
బలము మీఱఁగ మత్య్సబలముతోఁ దాఁకి
ఘీంకారములను జంకించునార్పులను
బింకంబులను మించి పేర్చి పోరాడ