పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/182

ఈ పుట ఆమోదించబడ్డది

168

ద్విపద భారతము.

నంధకారముఁ బోలి యరుదెంచు చున్న
సింధురంబులఁ బట్టి చించి చెండాడి
కాలుబంటుల నెల్ల ఖండించి వైచి
నేలపై వఱదగా నెత్తురు ల్వఱపి
మఱియు నంతటఁ బోక మహితాస్త్ర తతుల
నెఱి నాట నేయుచు నిమిషమాత్రమునఁ
దురగాక్ష కేతుసూతులతోడఁ గూడ
ధరఁ గూల్చె నూఱురథంబులవారి.
మదిరాస్యుఁడును గోపమహితాస్యుఁ డగుచుఁ
గదనంబునకును జక్కఁగఁ దేరుఁ గడపి
బహుగుణధ్వనులతోఁ బరఁగి పాతాళ
కుహరంబు రోదసీకుహరంబు నిండ
జడి గాఁగ రిపు లేయుశరపరంపరలు
నడుమనే తునియఁగా నఱకివేయుచును
రూపించి రధికవీరుల నోలిఁ దాఁకి
చాపక ట్టయి పడఁ జంపి నుగ్గాడి
రయ మొప్ప నన్నూఱురథములవారి
దయ లేక వ్రేల్మిడి తఱిమి పోకార్చె.
శౌర్యంబు మెఱయంగ సత్వ్తసంపదలు
ధైర్యసంపత్తియుఁ దనరార నతఁడు