పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/176

ఈ పుట ఆమోదించబడ్డది

162

ద్విపద భారతము.


కాంచనధ్వజములు గలిగి కైదువుల
నంచితశృంగార మగురథం బెక్కి
దారుణబృంహితధ్వనుల నంబుధులు
బోరునఁ గలఁగ నార్పులు మిన్ను ముట్ట
గోవు లేగినచోటు గోపాలసమితి
భావింప సేనతోఁ బదిల మై కదలె.
అంత నాతనితమ్ముడగుశతానీకుఁ
డంతకోపముఁ డౌచు సతికోపమునను
బటుఘోటక వ్రాత భటమహార్భటము
లటు నిటు గ్రమ్మ బ్రహాండంబు పగుల
సన్నుతరధ మెక్కి శస్త్రాస్త్ర నికర
సన్నద్ధుఁడై యుద్ధజయకాంక్ష వెడలె.
అతి ఘోరగజ యూధ మర్జిఁతో గొలువ
నతనితమ్ముడు మదిరాస్యుండు వెడలె.
ఆతనియనుజన్ముఁ డగుసూర్యదత్తుఁ
డాతత సైన్యదివ్యాస్త్రుఁ డై వెడలె.
వరుసతో నంత భూవరుపెద్దకొడుకు
చరితాత్మతేజుండు శంఖునామకుఁడు
హరిరత్న ఘనహీరహారమంజీర
శరకంకణాంగదకరయుక్తుఁడగుచు