పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/175

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము -ఆ-3

161



గజవాజిరథయోధగణములతోడఁ
నజితు లౌమమ్ము నాహపభూమి గెలిచి
పోవు చున్నాడు భుజశక్తి మెఱసి.
దేవర యింక నీదివ్యచిత్తంబు"
అనుటయు మీసంబు లదరఁ గోపించి
కను లెఱ్ఱవాఱ మైకంపంబు నొంద
ఎ ట్టెట్టురా త్రిగర్తేశుండు పసుల
బట్ట నెట్లో పరా భయ మింత లేక !
పట్టిన విధియాజ్ణ పట్టెఁ గా కేమి
పట్టి చంపఁగ నాకు బట్టయ్యె నిపుడు.
ఓమంత్రులార మీ రుగ్రవేగమున
నేమించి రథయోధనికరంబుఁ గూర్చి
పయనంబు సేయుఁడు భయదాట్టహాస
భయదభేరీభూరిభాంకృతు లెఁసగ ;
పోటుమానిసు లెల్లఁ బురి నుండ కుండఁ
జాటించి పిలుపుఁడు సంగ్రామమునకు,
భూరిశస్త్రాస్త్రాళిఁ బోలు పారునట్టి
తే రాయితము చేసి తెండు నేర్పునను"
అని చెప్పి విభుఁడు తా నఖిలసత్త్వమునఁ
గనకనిర్మితవజ్రకవచంబుఁ బూని
11