పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/172

ఈ పుట ఆమోదించబడ్డది

158

ద్విపద భారతము.



ఇది కార్య మని మీార లిచ్చ వాటించి
కదలుఁడు మేలు కాఁగలదు మీదటను."
అనవుడు విని త్రిగర్తాధీశుఁ డైన
ఘనుఁడు సుశర్మ దిగ్గన లేచి మ్రొక్కి
యువరాజకర్ణులు నొగి సమ్మతింప
నవనీశుతోడ నిట్లనియె గేల్మోగిచి
" దేవ మున్నొకపరిఁ దివిరి కీచకుఁడు
నావంకఁ బగ మోఁచి నన్ను భర్జించె ;
చే తప్పి వాయుజుచే జచ్చె వాఁడు !
అతనితో నాకు నని లేక పోయె!
నాటి కోపము మత్స్యనాధుపై నేవ
నాటింప నోపుదు ననుఁ బంపవయ్య.
ఒనర నాజీతపుటూళ్లలో నతఁడు
తనకుఁ గానుక లెత్తు దగ దన్న వినక.
పనుఫు గోవులఁ బట్టి పాండునందనులఁ
గని వత్తు విరటుభాగ్యము చూఱఁ దెత్తు. "
అనవుడు భూపాలుఁ డనుజు వీక్షించి
ఘను ద్రోణు నీక్షించి కర్ణునిం గాంచి
“సభవారు మీరు సుశర్మవాక్యములు
రభసంబు వింటి రూరక యుండ వలదు.