పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/171

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ-3.

157

కీచకుచావుఁ దాఁ గిమ్మీరవైరి
మోచినపనిగాని మోసంబు గాదు.
ఆయింతి ద్రౌపది యతఁడు వాయుజుఁడు
వేయు నేటికి మీకు విశదంబు గాదె?
గంధర్వు లనుపేరఁ గనలి కీచకుని
బాంధవసహితంబు పరిమార్చె నతఁడు.
ఈభీష్ముఁ డాడినయిన్ని చిన్నెలును
శోభిల్లు విరటుండు సుఖ ముండుపురిని, .
కావునఁ బ్రచ్ఛన్న గతిఁ బాండుపుత్రు
లావిరటుని మ్రోల నర్థి నున్నారు.
విరటుండు మనకును విద్వేషి గానఁ
దరమిడి యతనిపై దాఁడి పోవచ్చుఁ
బోయి గోగణములఁ బొదివి పట్టుటయు
నాయెడ యమసూనుఁ డడ్డ మై వచ్చు.
వచ్చిన నజ్ఞాతవాసభంగంబు
చెచ్చెర వెఱిఁగించి శీఘ్రంబె వారి
నడవికిఁ దొల్లిటియట్లు పో ననిపి
పుడమిఁ జేకొంప మప్పుడ; యటు గాక
కాంతేయు లరయ నక్కడ లేక యున్నఁ
జింతింప విరటునిసిరి యబ్బు మనకు.