పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/168

ఈ పుట ఆమోదించబడ్డది

154

ద్విపద భారతము.



పాండవులు బ్రదికియే యుందు రని ద్రోణాదులు
సభం బలుకుట,



అనవుడుఁ బలికె ద్రోణాచార్యుఁ డపుడు
"మనుజేంద్ర యువరాజుమాటఁ గైకొనకు.
వా రేల చత్తురు? వా రనాచార
దూరులు భయలోభదూరు లెంతయును.
దైవంబుబలము నుత్తమబాహుబలము
నావీరులకుఁ గాని యమర నెవ్వరికి .
ఒప్పఁ జంపునె వారి నుగ్రజంతువులు !
నిప్పున కీఁగలు నేర్చునే ముసర ?
ఆమాట లేటికి నా పాండుసుతుల
భూమిపై వెదకింపఁ బుచ్చు కాదనక"
అనిన భీష్ముండు ద్రోణాచార్యుమాట
విని సంతసించి యవ్విభు జూచి పలికె:
"కలశసంజాతుఁ డొక్కఁడ నిక్క మాడె;
కలవారిలో నెల్లఁగార్యజ్ఞుఁ డితఁడు.
దైవబలాఢ్యు లెంతయుఁ బాండుసుతులు
కావున వెదకియుఁ గానంగ లేను.
మీరని వారని మేము భేదింప
నేరము విను రెండునేత్రంబు లట్ల.