పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరాటపర్వము

147


ఉపకారపరులు మహోగ్ర సాహసులు,
సృపునిచిత్తముఁ బట్ట నేర్తు రెంతయును
పొరపుగాఁ దలపకు పొలతి నామాట
పురుషార్థమును వచు - బుణ్యంబు వచ్చు”
అనుటయు నమ్మాట లాత్మ లో నిలిపి
జననాధు దేవి పాంచాలి కిట్లనియె:
ఉచిన నీ మాటకు దొండాడ వెఱతు
నవుగాము లేఱుగ నీయాజ్ఞ జేసెదను.
భూవిభుండున్నాడు పుత్రుఁ డున్నాడు
మావార లున్నారు మన్నింపు మమ్మ.
తివుటమై నీవు చింతించు కార్యంబు
లివి యవి యని నాకు నోఱిగింపు మమ్మ,"
అనుచుఁ బ్రార్ధించిన సద్దేవియింట
వనిత తొల్లిటి యట్ల నర్తించు చుండె
జను లొండొరులు భూమి చక్రంబునందు
బనిగొని తమలోన భాషించి రిట్లు:
విరటునిమఱిది యై వెలయుకీచకుని
'బరిమార్చి రఁట యెంత బలియు రున్నారొ !
వాని నాహసమును వానిదోర్బలము
నా నిగర్వం బైన వర్ణింప న రుదు.