పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/155

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

141


గేకయపుత్రి శోకించు ఠావునకుఁ
బ్రాకటంబుగఁ బోయి భయభక్తి ఁ బలికె
"ఏ పార సైరంధ్రి నిట నుండ నీక
పాపుద మిఁకఁ జాలుఁ బదివేలు వచ్చె!
ప్రొద్దున లేచి వేపో మ్మని మిగుల
బుద్దిగాఁ జెప్పి నేర్పునఁ బుచ్చు మబల
మగవారు దానితో మాటాడ వెఱతు
రొగిఁ బట్టి చంపించు నొకముహూర్తమున !
ఈయింతికై చావ నెంద ఱున్నారొ
తోయజానన సాముతోడిపొ త్తయ్యె!”
అనవుడు విరటుతో నబల యిట్లనియె
"మనుజేంద్ర కలసె నీమనసు నామనసు
ఏనును సైరంధ్రి నీవేళ ననుపఁ
బూని యుండితి నీవుఁ బొసఁగఁ జెప్పితివి.
వెనుకొని యిఁక నింతి వెడలంగఁ ద్రోచి
జననాధ మఱి నీళ్లు చల్లి మ్రొక్కెదను.??
అని చెన్పినంతలో నంధకారంబు
కనుకని విరిసి భాస్కరుఁడు దోఁచుటయుఁ
గట్టినమడుగుతోఁ గ్రమ మొప్ప వచ్చి
నెట్టన నొకయేటినీటిలో మునిఁగి