పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/144

ఈ పుట ఆమోదించబడ్డది

130

ద్విపద భారతము.

తనజయం బాత్మలోఁ దలపోయు చుండి
వనజనేత్రకు వానివధ నేర్పరింప
నచ్చటి కొకరీతి ననలంబుఁ దెచ్చి
యచ్చుగా ముట్టింప నపుడు పాంచాలి
కన్నారఁ గీచకాగ్రణిచావుఁ జూచి
సన్నపునగవుతో సంతసిల్లుచును
వెఱఁగుపాటున వానివికృతంబుఁ జూచి
తఱమిడి నవ్వుచుఁ దరుణి యి ట్లనియె:
"కూడునే కీచక కుడిచి కూర్చుండి
వేడుక నీపాటు వెసఁ దెచ్చికొంటి.
నీవృధాగర్వంబు మీపాపమతియు
నీవర్తనముఁ జేసె నేఁ డింతపట్టు ?
అనద వై కోరితి వతనుసౌఖ్యంబు ;
అనుభవించెదు గాక యతనుసౌఖ్యంబు !"
అను చున్న ద్రౌపది ననిలసంభవుఁడు
కనుఁగొని తనపెంపు గాన రాఁ బలికె:
"మానినీమణి నీకు మానెనే వగపు
పీనుఁగు నైవీఁడు పృధివిఁ గూలుటయు ?
హరిణాక్షి కోపంబు లణఁగెనే నీకు
దొరలి పాపాత్ము సుద్ధురతఁ గూల్చుటయు ?