పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

129

కీచకుం డపుడు మిక్కిలి మూర్ఛపోయి
లేచి వాయుజు నేసె లీల నాక్షణమె.
వ్రేసినఁ దలఁ బట్టి విదలించి వానిఁ
బూసెజ్జఁ ద్రోచియుఁ బోక వాయుజుఁడు
కీచకునురము నుంకించి వ్రేయుటయు
నా చేతివ్రేటున నవశుఁ డై వాఁడు
విలవిలఁ గాళ్లను వెసఁ దన్ను కొనుచు
నలసి నెత్తురు గ్రక్కి యావులించుచును
దెలు పైనకన్నులు తిరుగవేయుచును
బలిమి దెక్కోలుగాఁ బ్రాణము ల్విడిచె.
అప్పుడు బహుభూషితాంగు గీచకుని
నొప్పుగాఁ బడ వైచి యున్న వాయుజుఁడు
పల్లవనవఫలభరితవృక్షంబుఁ
ద్రెళ్ల వైచివదంతి తెఱఁ గయ్యెఁ జూడ.
అంతఁ గీచకుఁ జిత్ర మగుచావు చంప
నెంతయుఁ బ్రియ మైన నేచి వాయుజుఁడు
కరములుఁ బదములు ఘనమస్తకంబుఁ
గర మర్థితో వానికడుపులో ఁదూర్చి
ముష్టిఘట్టన లిచ్చి ముద్దగాఁ జేసె.
తుష్టుఁ డైయపుడు వాతూలనందనుఁడు