పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/138

ఈ పుట ఆమోదించబడ్డది

124

ద్విపద భారతము.

కీచకుఁడు ద్రౌపదికై నాటక శాలకుం బోవుట.

అంతఁ గీచక ముఖ్యుఁ డర్థిదీపింప
వింతగాఁ గైసేసి వేగిరంబునకు
సైరంధ్రి యింతకు సంకేతమునకుఁ
జేరుఁ బొ మ్మనుబుద్ధి చీకాకుపడఁగ
మధుపానమత్తుఁ డై మత్తేభలీల
నధిక మౌవిధిబారి కడ్డ మైనట్లు
తా నొంటి వెడలె ముందర పట్టి యపుడు
కానంగ రానిచీఁకటికి భీతిలక ;
వెస నిట్లు వెడలి భూపతిమందిరమునఁ
బొసఁగ నాటకశాల బోరునఁ జొచ్చి
యాయున్న యునికియు నాదైన్యవిధము
నాయంధకారంబు నాత్మఁ గైకొనక
మరలక తనసేయుమగతనంబునకు
దొరసినభుజశక్తి తోడుగా నపుడు
శాలకు నడుమగాఁ జని శయ్యమీఁదఁ
గేలు సాఁచినఁ జూచి కిమ్మీరవైరి
కోపాగ్ని నంగారకుఁడు వోలె మండి
రూపింప లయకాలరుద్రుఁ డై కినిసి