పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/134

ఈ పుట ఆమోదించబడ్డది

120

ద్విపద భారతము.

అప్పటి కెదు రాడ నలికి యారీతిఁ
దప్పించుకొని పోయి తరళాక్షి యిటకు
నొంటిమై రాకున్న నొగి లేవ నడచి
కుంటు చూపినయట్లు ఘోరంబుగాదె.
అది యెట్లు రాకుండు నాసఁ బుట్టించి ?
ఎదిరిఁ దన్నును దాను నెఱుఁగదే మొదల ?
అరిమురి సంకేత మ ట్లేల చెప్పు?
వెరవున సతిఁ గూడి విహరింతుఁ గాక"
అని తనకోర్కె లుయ్యాల లూఁగఁగను
మనసిజునకు లొంగి మఱియుఁ గీచకుఁడు
మృగనేత్ర తనయొద్ద మెలఁగిన ట్లయిన
నగపడి సరసంబు లాడిన ట్లయిన
బయలుఁ గౌఁగిటఁ జేర్చి భాషించి వగచు
జయశాలి మారుండు చాల నాడింప
ఇన్ని లాగుల భ్రమ నెఱుక లే కున్న
యన్నఁ గీచకుతమ్ముఁ డప్పు డిట్లనియె:
"ఇది యేమి డస్సితి నిది యేమి బ్రమసి
తిది యేమి, యోయన్న యిచ్చోట నుంట !
పగతుఁ డే తేంచిన వగవ వెన్నఁడును,
తగులుమృత్యువుఁ గన్నఁ దలఁక వెన్నఁడును,