పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

116

ద్విపద భారతము


"వాయుజ నేఁ జేయ వలనైన కార్య
మాయె నీ వెఱుఁగుదు వటమీఁదిపనులు.
ఘన మైనచీఁకటి గలరాత్రి నేఁడు
జనుల వంచించి కీచకుఁ జంప వచ్చు”
అనిన నించుక నవ్వి యతఁ డిట్టు లనియె
"వనిత నీ వేమంటి; వాఁ డేమి పలికె ?
చెప్పు మంతయు ; వాని శిక్షించుపనులు
చెప్ప నేటికి ? వాఁడు చిక్కినఁ జాలు "
అనవుడుఁ బాంచాలి యాసింహబలుఁడు
జననాధునగరికిఁ జనుదెంచు తెఱఁగుఁ
జనుదెంచి తనుఁ జూచి చపలుఁ డై యంత
చసవు బీరముఁ జూపి సంభ్రమించుటయు
వాని నుత్కట రీతి వరుస గాదనుచు
నానీచువచనంబు లంగీకరించి
నెలకొన్న రాత్రి వానికి నాట్యశాల
యలరినసంకేత మని చెప్పుటయును
వాఁడంత నొంటిమై వత్తుఁ గా కనుచుఁ
బోఁడిగాఁ జనుటయు: బొసఁగ నేర్పఱిచె.
అప్పుడు బకవైరి యంతరంగమున
నుప్పొంగువేడ్కతో నువిద వీక్షించి