పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/127

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

113


పనిగొని నిన్నేను బలిమిఁ బట్టినను
వనజాక్షి నా వ్రేలు వంప రెవ్వరును,
అంత చేసితి నిన్ను నాస్థానభూమి
నింత నెవ్వరికై న నే మన వచ్చె :
ఎక్కడిగంధర్వు లెక్క డిమగలు
నిక్కమై కలిగిన నిన్న రా వలదె?
చపలాక్షి యిటమీఁద సైరింప" సనిస
ద్రుపదనందన యోర్పు తోడవుగా నిల్చి
“పన్నుగా నే మాయ బన్నక యున్న
మున్నాడునే కార్యముఖము గా " దనుచు
నెయ్యంబు దోఁప నన్నీచుమాటలకు
నియ్యకొన్నది పోలె నించుక నవ్వి
వానితో ని ట్లను "వల నైనబుద్ధు
లే నెన్ని చెప్పిన హితవుగా వినవు
రీ తెఱుంగవు వేగిరించెదు కాని;
నీతలంచినయట్లు నేఁ జేయఁ గలను.
తగ వేది మగవాఁడు తమకించునపుడు
మగువకు దన పెంపు మానంగ రాదు .
కావునఁ బ్రకటంబు గానిమార్గమున
భావింప వలయు నేర్చడ నిట్టిపనులు"