పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/121

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

107


కావున మనల నక్కడకు నక్కడకు
భావించి చూతురు ప్రజలు దప్పకయ.
మనయర్జునునిఁ జూడు మహి నింతవాని
గనిపెట్టి దైవంబు గాసి పెట్టెడిని,
సృష్టిలోపల నుర్వశీమోహునకును
దృష్టి తాకినయట్లు తేజంబు మాసె.
తనుఁ జూచి లజ్జింతుఁ దగ వొప్ప మున్ను
ననుఁ జూడ నిప్పుడు నరుఁడు లజ్జించు!
ప్రతివీరులకు, బాహుబల మొప్పఁ జూపు
నతఁడు నాట్యముఁ జూపు నతివల కిపుడు.
అదియును గాక పాయక నాకు నకులు
మదిలోనఁ దలప నుమ్మలికంబు పుట్టు,
అశ్వినీ దేవతలందు జన్మించి
అశ్వశిక్షకుఁ డయ్యె నన్యులం గొలిచి.
ఘనుఁడు మాద్రీదేవిగారాబుకొడుకు
తనకు నొండొకరాజు దగఁ గొల్వ వలసె.
ఈ చోట నీరీతి నింత వాఁ డున్నఁ
జూచిన వా రెల్లఁ జోద్య మందెదరు.
సహ దేవుఁడును ధర్మ సహకారి సువ్వె
సహజతేజోరాశిసహితుఁ డీమహిని.