పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

106

ద్విపద భారతము


శరణాగతాభిరక్షకుఁడు ధర్మజుఁడు.
చిరయశశ్చంద్రికాంచితుఁడు ధర్మజుడు.
ఇట్టిధర్మజు దూఱ నెవ్వరివశము.
పుట్టని శత్రువు ల్బుమిఁ గల్గునతఁడు

తననాధులు విరటునిం గొలిచి గాసిల్లుటకు ద్రౌపది పరితపించుట,

విరటునిఁ దాఁ గొల్చి విహరించునపుడు
వురవురఁ బొక్కి యప్పుడె శాంతిఁ బొందు,
మఱియును నీచేయుమహితసత్వములు
మెఱసి యెన్నెద మన్న మితి మేర లేదు.
అట్టినీవును గట్టియలు పట్టి విఱువ
నెట్టన మనసులో నెగు లొందు నాకు.
మదగజశార్దూలమహితసింహములఁ
బదిల మై గరిడిలోపల నీవు పెనఁగ
నన్నును బిలిపించి నరనాధుదేవి
నిన్నుఁ జూపిన నాకు నిగ్రహం బెసఁగు.
నలినాక్షు లప్పుడు నావికారంబు
తెలియంగఁ జూచి సందియముఁ బొందుదురు.