పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/117

ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

103


తగదని యెన్ని చందములఁ జెప్పినను
మగుడ నేరక యున్న మగుడ నిట్లంటి
"గంధర్వు లేవుకరు గలరు నామగలు
సంధించి నినుఁ బట్టి చంప నోపుదురు.
వైరంబు కొఱగాదు వలదు పొ' మనిన
నీరతారలు గొన్ని యెన్ని వాఁ డపుడు
పోయెఁ బోయిన సంత భూనాధుదేవి
దాయంగ ననుఁ బిల్చి తప్ప భావించి
తముని యింటి మద్యంబుఁ దె మ్మనుచుఁ
బొ మ్మని ననుఁ బెద్దప్రొద్దు ప్రార్థింప
'నేమియు నన నేర కేనును బోయి
భామకు మద్య మప్పాపాత్ము నడుగ
వినక వాఁడును గొన్ని వెడమాట లాడి
ననుఁ బట్ట వచ్చె నన్యాయంబుఁ దలఁచి.
చే యీక యేనును శీఘంబ పాఱి
మీాయున్న సభఁ జేర మెఱసి కీచకుఁడు
కామాంధుఁ డై తీవ్రగతిఁ జేర వచ్చి
యే మేమి చేసెనో యెఱుఁగవా నీవు?
నీ వేమి చేయుదు నీకోపనహ్ని
కావేళ యమసూతి యడ్డంబు వచ్చె.