పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/115

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

101


ద్రౌపది భీమునిచెంతకుఁ బోయి తన భంగపాటు చెప్పి కొనుట

అప్పుడు సుఖనిద్ర ననిలనందనుఁడు
ఱెప్పలు నెస మోడ్చి ఱిచ్చపడ్డట్లు
తొలుకారు మెఱుఁగులతునకలో యనఁగఁ
గలికి యూర్పులు దీపకళిక లల్లాడఁ
గలకౌరవుల నెల్లఁ గడపాలుసేయఁ
గల గని చిఱునవ్వు గలమోము వెలయ
నఱిమురిఁ దాఁగొన్నయన్నంపు రాసు
లఱుగఁ బ్రేవులు కుక్షి నధిక మై మ్రోయఁ
గుడిప్రక్క మీఁదుగాఁ గొమరారియున్న
బడఁతి యొయ్యనఁ బోయి పతిఁ జూచి వగచి
"అక్కట యిసుముమీఁ దై కీచకుండు
తక్కక నాకు నంతటితప్పు చేసి
మిసిమింతుఁడును గాక మేటి యై పోయె
నిసుమంతయును గిన్క నెదఁ గాంచ వీవు !
కంటికి నిదుర యెక్కడఁ గల్గె నీకు ?
వంటల డస్సితో : వానిఁ గాచితివొ
మాయన్న వల దన్న మిగులంగ లేక ?
వాయుజ నే నొల్ల వట్టి ప్రాణములు."