పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

మొదటినుండియుఁ బరాన్నమునుగోరుట విహితమైన ధర్మముగ నున్నందున మనవా రిది యొకగొప్ప తప్పగ నెంచకపోవచ్చును. కాని ప్రాణముతో నున్న పాశ్చాత్యదేశములవంకఁ జూడుఁడి, విద్యావిషయమున నితర దేశముల కంటె వెనుకబడకుండుటకై వారు చేయు ప్రయత్నములు చూచిన నెవ్వరి మానస మాశ్చర్యానందముల మునుంగక మానును ? విద్యావిషయమై వారి కింతకత యేల ! కారణము స్పష్టము. నేఁడు వలసిన విద్యలన్నియు నేర్పు విద్యాపీఠములును, గ్రంథ రాజములును ఇంగ్లండు దేశమునం దున్నం దున వేఱు దేశమునకుఁ బోకయ, వేఱుభాష నేర్చుకొనకయు వారి కన్ని విద్యలును, గళలును, వృత్తులును నేర్చుకొనుటకు వీళ్లున్నవి. దైవము యొక్క యద్భుత ఘటనచే శాస్రృసంబంధమయిన ఇంగ్లీషుగ్రంథములన్నియు నేఁడొక్క పెట్టున నశించిన వనుకొనుఁడు. పాప మిట్టిదురవస్థ యే దేశమునకు నెప్పడును రాకయుండునుగాక ! వచ్చినయెడల నింగ్లీషువారి విద్యాభ్యాస స్థితి యేమగును ? ఏవిద్య నేర్చుకొనవలయునన్నను బరభాషయైన జర్మనీ భాషనో, ఫెంచిభాహనో మొదలభ్యసించి తద్ద్వారమున నిష్ట విద్యనుగాని, కళలనుగాని, వృత్తులనుగాని నేర్చుకొనవలెను. అప్పడు వారిసాంపత్తికస్థితి యిప్పడున్నట్లుండఁ గలదా ? పొగబండి నడపువిధములఁ దెలిసికొనుటకు జర్మనీ దేశమునకు, నావిక శాస్త్ర మెఱుంగుటకు ఫ్రాంసు దేశమునకు, నాకాళయానము నభ్యసించుటకు ఇటలిదేశమునకు "దేహి యనిపోవల సిన యింగ్లీషు వారు తమ దేశాభివృద్ధి యెట్లుచేయఁగలరు ? కావున స్వస్వ మాతృభాషలలో సకలవిద్యాసాధనము లుండుట నాగరక రాష్ట్రముల యొక్క మొదటిలకణము.

ఇంగ్లీషు నేర్చుకొనుట

అట్లన నెవ్వరును సంస్కృతమునుగాని యింగ్లీషునుగాని నేర్చుకొనఁ గూడదాయనియు, నాయాభాషల నేర్చుకొని విద్యలను సాధించుటకు వీలున్నప్పడు మాతృభాషలో లేవన్న చింత మన కేల యనియుఁ గొంద అడుగవచ్చును. సంస్కృతభాషనుగాని, యింగ్లీషుభాషనుగాని, ఫ్రెంచి మొదలయిన తదితర భాషలనుగాని చేతనైనవారు, ధనమున్నవారు, వీలుగల వారు నేర్చుకొవలయుననియే నా తాత్పర్యము. వానిలోను, రాజభాస యయినందునను, లోకమందలి యితర భాషలకంటె నన్ని విధములను గ్రంథ భాండారమునం దత్యధికమైనదని ప్రఖ్యాతిచెందినదియు, నగుటచే నింగ్లీషు భాషను నేర్చుకొనుట మననాగరకతాభివృద్ధికిని దేశోన్నతికి నత్యం తావళ్య కమని నాయభిప్రాయము. కాని యది యెంత వఱకు సాధ్యమో ! జన