పుట:ది కేటల్ ట్రెస్‌పాస్ యాక్టు, 1871.pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము—2

బందెలదొడ్లు మరియు బందెలదొడ్ల రక్షకులు

బందెలదొడ్ల స్థాపన,

4. జిల్లా మేజిస్ట్రేటు, రాజ్య ప్రభుత్వ సాధారణ నియంత్రణకు లొబడి ఆయా సమయములలో ఒసగు ఆ దేశములనుబట్టి ఆయా స్థలములలో బందెలదొడ్లు స్థాపింపబడవలెను.

బందెల దొడ్డిని ఏ గ్రామము ఉపయోగించవలసియుండునో జిల్లా మేజిస్త్రేటుచే నిర్థారణ చేయబడవలెను.

బందెలదొడ్ల నియంత్రణము, మరియు బందెలొ పెట్టబడిన పశువుల మేతకగు ఖర్చుల రేటు.

5. బందెలదొడ్లు జిల్లా మేజిస్ట్రేటు నియంత్రణ క్రింద ఉండవలెను మరియు బందెలో పెట్టబడిన పశువులకు మేత చేయుటకు, వాటికి నీళ్ళు పెట్టుటకు అగు ఖర్చుల రేట్లను ఆయన నియతము చేయవలెను మరియు ఆయా సమయములందు వాటిని మార్చవచ్చును.

బండెలదొడ్మ రక్షకుల నియూమకము.

6. రాజ్య, ప్రభుత్వము ప్రతి బందెల దొడ్డికి ఒక బందెల దొడ్డి రక్షకుని నియమించవలెను.

బందెలదొడ్డి రక్షకులు ఇతర పదవులను నిర్వహించవచ్చును.

ఏ బందెలదొడ్డి రక్షకుడైనను ఆ పదవితోపాటు ప్రభుత్వము క్రింద ఏదేని ఇతర పదవిని అదే కాలములో నిర్వహించవచ్చును.

బందెల దొడ్డి రక్షకులు పబ్లిక్‌ సేవకులై యుండుట.

ప్రతి బందెల దొడ్డి రక్షకుడు భారత శిక్షా స్మృతి ( 1860లోని 45వ చట్టము )లొ నిర్వ చింపబడినట్లు పబ్లికు సేవకుడుగ శాసింపబడవలెను.

బం దెలదొడ్డి రక్షకుల కర్తవ్యములు

రిజిస్టర్లను ఉంచుట మరియు వివరణ లను అందజేయుట.

7. ప్రతి బం దెలదొడ్డి రక్షకుడు రాజ్య ప్రభుత్వము ఆయా సమయములందు ఆదేశించు విధముగా రిజిస్టర్లను ఉంచవలేను మరియు వివరణలను అంద జేయవలెను,.

అభి గ్రహణములను రిజిస్టరు చేయుట.

8. పశువులు బం దెల దొడ్డికి తేబడినవుడు బం దెలదొడ్డి రక్షకుడు తన రిజిస్టరులో ఈ క్రిందివాటిని నమోదుచేయవలెను, అవేవనగా,--(ఎ) జంతువుల సంఖ్య మరియు వాటి వర్షన. (బి) అవి అట్లు ఏ దినమున మరియు ఏ వేళకు తేబడినవి. (సి) అభిగ్రహణము చేసిన వ్యకి పేరు నివాసము, మరియు (డి) తెలిసినచో, వాటి సొంతదారు. పేరు మరియు నివాసము.

అతడు ఆ నమోదు యొక్క. నకలును, అభిగ్రహణము చేనీన వ్యకికి లేక అతని ఏజంటుకు ఈయవలెను.

పశువుల బాథ్యతను వహించుట మరియు వాటికి మేతవేయుట.

9. బందెలదొడ్డి రక్షకుడు ఇందు ఇటు పిమ్మట ఆ దేశింపబడినట్లు పశువులమ గూర్చి పరిష్కారము జరుగు వరకు వాటి భాద్యత వహించి వాటికి మేత వేసి నీరు పెట్టవలెను,

అధ్యాయము -8

పశువులను బందెలో పెట్టుట

భూమిని నాశము చేయు పశువు.

10. ఏ దేని భూమిని నేద్యము చేయువ్యక్తి, లేక ఆక్రమణదారు, లేక ఏదే భూమి పె పైరును లేక పంటను పండించుటకు నగదు అప్పు ఇచ్చిన ఎవరేని వ్యకి లేక అట్టి పైరును లేక పంటను లేక అందలి ఏదేని పాలును కొనిన లేక తాకట్టు పెట్లుకొనిన వ్యక్తి.

అట్టి భూమి పై అక్రమముగా ప్రవేశించి, భూమినిగాని, చానిపైగల ఏదేని పైరును లేక పంటనుగాని నాశముచేయుచున్న ఏ వేని పశువులను అభి గ్రహణముజేసి లేక అభి గ్రహింప జేసిం


ఆనుకూలానుసరణ ఉత్తరువు, 1937 ద్వారా ఉంచబడినది,