పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెల్లడించకుండ, 'జడ్' కు అదే ఆస్తిని విక్రయించిగాని, తాకట్టు పెట్టి గాని 'జడ్' నుండి క్రయమును లేక తాకట్టు డబ్బును పొందును. 'ఏ' దగా చేసిన వాడగును.

ప్రతి రూపణముద్వారా దగా చేయుట,

416. ఒకవ్యక్తి తాను వేరొకవ్యక్తి నని నటించుట ద్వారా గాని ఎరిగియుండియే ఒక వ్యక్తిని మరొకవ్యక్తి స్థానమున ఉంచుట ద్వారా గాని, ఎరిగియుండియే తాను తననుగా గాక వేరొక వ్యక్తిగా తెలియజేయుటద్వారాగాని, మరొకవ్యక్తిని వాస్తవముగా అతడు ఎవరో ఆవ్యక్తి గా గాక వేరొక వ్యక్తి గా తెలియజేయుటద్వారా గాని, దగాజేయుచో ప్రతిరూపణము ద్వారా దగా చేసినట్లు చెప్పబడును.

విశదీకరణము:-ఎవరిని ప్రతిరూపణము చేయుట జరిగినదొ ఆ వ్యక్తి నాస్తవ వ్యక్తి యైనను, కాల్పనిక వ్యక్తియైనను ఈ అపరాధము చేసినట్లగును.

ఉదాహరణములు

(ఏ) ఏ' అనునతడు తాను అదే పేరుగల ఒక ధనికుడైన బ్యాంకరుగ నటించుట ద్వారా దగా జేయును.'ఏ' ప్రతి రూపణముద్వారా దగా చేసినవాడగును.

(బి) 'ఏ' అనునతడు మరణించిన 'బి' అనువ్యక్తి గా నటించుట ద్వారా దగాజేయును. 'ఏ' ప్రతిరూపణము ద్వారా దగా చేసినవాడగును.

దగా చేసినందుకు శిక్ష.

417. దగా జేయు వారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

నీ వ్యక్తి యొక్క హితమును కాపాడుటకు అపరాధి బాధ్యుడై యున్నాడో ఆ వ్యక్తికి అక్రమ నష్టము కలుగవచ్చునని ఎరిగియుండి దగా చేయుట.

418. ఏ వ్యవహారములో, శాసనరీత్యాగాని, శాసనబద్ధ మైన కాంట్రాక్టు రీత్యాగాని, ఎవరి హితమును కాపాడుటకై తాను బాధ్యుడై యున్నాడో ఆవ్యక్తి కి తాను తద్వారా అక్రమ నష్టమును కలిగించవచ్చునని ఎరిగియుండియు ఆ వ్యవహార సంబంధముగా దగాచేయు నతడెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావదికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, జుర్మానా తోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ప్రతి రూపణము ద్వారా దగా చేసినందుకు శిక్ష.

419. ప్రతిరూపణముద్వారా దగాచేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

దగా చేసి నిజాయితీ లేకుండ ఆస్తిని అంద జేయించుట.

420. దగాజేసి తద్వారా నిజాయితీ లేకుండ మోసగింపబడిన వ్యక్తి చే ఏ వ్యక్తి కైనను ఏదేని ఆస్తిని అందజేయించు, లేక విలువగల 'సెక్యూరిటీనైనను, విలువగల సెక్యూరిటీగా మార్చుటకు వీలుండి సంతకము చేయబడిన లేక ముద్రవేయబడిన దేనినైనను, రూపొందింపజేయు, మార్పించు, లేదా దానినంతనుగాని, అందలి యేదేనిభాగమునుగాని నాశనముచేయించు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఆస్తి విషయమున కపటముతో చేసిన పత్రములు, వ్యయనములను గురించి

ఋణదాతలకు పంచిపెట్ట బడకుండా చేయుటకై ఆస్తిని నిజాయితీ లేకుండా గాని కపటముతోగాని, తొలగించుట లేక దాచుట.

421. తన ఋణదాతలకు గాని ఎవరేని ఇతర వ్యక్తి యొక్క ఋణదాతలకుగాని, శాసనానుసారము ఏదేని ఆస్తి పంచి పెట్ట బడకుండ జేయు ఉద్దేశముతోనైనను, పంచి పెట్ట బడకుండా చేయగలనని ఎరిగియుండియైనను, నిజాయితీ లేకుండా గాని కపటముతోగాని ఆ ఆస్తిని తొలగించు, దాచు, లేక ఏ వ్యక్తి కైనను అందజేయు, లేక తగినంత ప్రతిఫలము లేకుండ ఏవ్యక్తి కై నను బదిలీచేయు, లేదా బదిలీచేయించు నతడెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

నిజాయితీ లేకుండగాని కపటముతో గాని ఋణమును ఋణ దాతలకు లభ్యము కాకుండునట్లు చేయుట,

422. తనకుగాని, ఎవరేని ఇతర వ్యక్తి కిగాని రావలసిన ఏదేని ఋణమును, లేక ఆధ్యర్థనను తానుగాని ఆ ఇతర వ్యక్తి గాని చెల్లింపవలసిన ఋణములకై శాసనానుసారముగ లభ్యముకాకుండునట్లు నిజాయితీలేకుండ లేదా కపటముతో చేయునతడెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.